కోయిల్ అల్వార్ తిరుమంజనం
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:48 PM
స్థానిక రాజేంద్రనగర్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు
గుంతకల్లుటౌన, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): స్థానిక రాజేంద్రనగర్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఉదయం దేవాలయాన్ని పచ్చకర్పూరంతో శుద్ధి చేశారు. అనంతరం స్వామి వారి మూలవిరాట్‌కు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ ఎం భాస్కర్ రంగయ్య, సెక్రెటరీ నారాయణస్వామి, ఉపాధ్యక్షులు శ్రీశైలం వెంకటేశ్వర్లు, రమేష్ రెడ్డి, ప్రసాద కమిటీ చైర్మన జయంతి వెంకట్, సభ్యులు సుదర్శనబాబు, వీర, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.