Khadri ఖాద్రీశుడి హుండీ ఆదాయం రూ.84.94 లక్షలు
ABN , Publish Date - Oct 07 , 2025 | 01:03 AM
పట్టణంలో వెలసిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి హుండీ ఆదాయం రూ.84.94 లక్షలు వచ్చినట్లు ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
కదిరి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): పట్టణంలో వెలసిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి హుండీ ఆదాయం రూ.84.94 లక్షలు వచ్చినట్లు ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆలయంలోని హుండీ సొమ్మును సోమవారం లెక్కించారు. 51రోజులకుగాను ఈ మొత్తం నగదుతోపాటు 6 గ్రాములు బంగారం, అర కిలో వెండి, 67 అమెరికన డాలర్లు, 20 నేపాలీ రూపాయలు, 2,800 ఇండోనేషియా కరెన్సీ, 160 ధర్హంలు, 5 రియాళ్లు వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ఆధికారులు, సిబ్బంది. స్వచ్ఛంద సేవకులు, భక్తులు పాల్గొన్నారు.