నోరు అదుపులో పెట్టుకో
ABN , Publish Date - Aug 30 , 2025 | 12:10 AM
వైసీపీ నియోజకవర్గ ఇనచార్జి తలారి రంగయ్య నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని టీడీపీ సీనియర్ నాయకులు చౌళం మల్లికార్జున, వాల్మీకి కార్పొరేషన రాష్ట్ర డైరెక్టర్ వైపీ రమేష్ హెచ్చరించారు
కళ్యాణదుర్గం, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): వైసీపీ నియోజకవర్గ ఇనచార్జి తలారి రంగయ్య నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని టీడీపీ సీనియర్ నాయకులు చౌళం మల్లికార్జున, వాల్మీకి కార్పొరేషన రాష్ట్ర డైరెక్టర్ వైపీ రమేష్ హెచ్చరించారు. శుక్రవారం స్థానిక ప్రజావేదిక వద్ద వారు మీడియాతో మాట్లాడారు. తలారి రంగయ్య ఓ చదువుకున్న అజ్ఞానిలా .. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి ఇకైనా మానుకోకపోతే గ్రామాల్లో తలారి రంగయ్యను తిరగకుండా ప్రజలే అడ్డుకుంటారని అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో నాటి మంత్రి ఉషశ్రీచరణ్ నియోజకవర్గాన్ని అవినీతికి కేరాఫ్ అడ్ర్‌సగా మార్చేసిందన్నారు. నాడు ఎంపీగా ఉన్న తలారి రంగయ్య ఏ నాడూ దుర్గం వైపు కన్నెత్తీ చూడలేదన్నారు. నేడు లేనిపోని ఆరోపణలు చేస్తూ.. అభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్నాడని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు రూ. కోటతో అభివృద్ధి పనులు చేపట్టారని, తన సొంత నిధులతో బీటీపీ కాలువ పనులు ప్రారంభించారని అన్నారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచు గాజుల శ్రీరాములు, మార్కెట్ యార్డ్ చైర్మన లక్ష్మీదేవి, మండల కన్వీనర్లు పాలబండ్ల శ్రీరాములు, గోళ్ల వెంకటేశులు, ధనుంజయ, శివన్న, టీఆర్ తిప్పేస్వామి, రామరాజు, శర్మాస్ వలీ, పాపంపల్లి రామాంజినేయులు, టీడీపీ నాయకులు దండా వెంకటేశులు, ఆవుల తిప్పేస్వామి, డిష్ మురళి, నగేశ, గురుప్రసాద్, కొల్లాపురప్ప, హనుమంతరాయుడు, బొజ్జన్న, లాల్ క్రిష్ణ, నారాయణ, సునీల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.