Swami కొండకు చేరిన కాటమయ్య స్వామి ప్రభ
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:13 AM
మండలంలోని సంజీవపురం కాటమయ్యస్వామి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం సమీప గ్రామాల ప్రజలు పన్యరపు బండ్లు కట్టారు. ఈ బండ్లలో కొండవద్దకు చేరుకొని కొండచుట్టు ప్రదక్షణలు చేశారు.

బత్తలపల్లి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని సంజీవపురం కాటమయ్యస్వామి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం సమీప గ్రామాల ప్రజలు పన్యరపు బండ్లు కట్టారు. ఈ బండ్లలో కొండవద్దకు చేరుకొని కొండచుట్టు ప్రదక్షణలు చేశారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి కాటమయ్యస్వామి ఉత్సవ ప్రభ ను రకరకాల పూలతో అందంగా అలంకరించి.. ముస్టురు గ్రామం నుంచి ఊరేగింపుగా కాటమయ్యస్వామి కొండకు తీసుకొచ్చారు.