cricket tournament క్రికెట్ టోర్నీ విజేత కాశీపురం జట్టు
ABN , Publish Date - Jun 02 , 2025 | 11:43 PM
మండలంలోని కాశీపురం గ్రామంలో నిర్వహించిన కేసీఎల్-2 క్రికెట్ టోర్నమెంట్‌లో కాశీపురం జట్టు విజేతగా నిలిచింది.
రాయదుర్గంరూరల్, జూన 2(ఆంధ్రజ్యోతి): మండలంలోని కాశీపురం గ్రామంలో నిర్వహించిన కేసీఎల్-2 క్రికెట్ టోర్నమెంట్‌లో కాశీపురం జట్టు విజేతగా నిలిచింది. సోమవారం నిర్వహించిన కేసీఎల్-2 మండల స్థాయి ఫైనల్ మ్యాచలో కాశీపురం - కెంచానపల్లి జట్లు తలపడ్డాయి. కెంచానపల్లి జట్టు 12 ఓవర్లలో 39 రన్నులు చేయగా.. కాశీపురం జట్టు ఆరు ఓవర్లలోనే 40 రన్నులు చేసి విజయం సాధించింది. కాశీపురం జట్టుకు విన్నర్ ట్రోఫీతో పాటు రూ. 30 వేలును, రన్నర్‌పగా నిలిచిన కెంచానపల్లి జట్టుకు రూ. 15 వేలు నగదును ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు తనయుడు కాలవ భరత అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ హనుమంతు, టీడీపీ నాయకులు సోమశేఖర్, వీరే్‌షస్వామి, మనోహర్‌నాయుడు, పానాయుడు, క్రీడాకారులు పాల్గొన్నారు