సూపర్‌సిక్స్ టోర్నీ విజేత కణేకల్లు ఆర్డీటీ
ABN , Publish Date - Sep 15 , 2025 | 12:06 AM
స్థానికంగా రెండురోజులుగా జరిగిన సూపర్‌సిక్స్ టోర్నీలో కణేకల్లు ఆర్డీటీ జట్టు విజేత నిలిచింది.
కణేకల్లు, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): స్థానికంగా రెండురోజులుగా జరిగిన సూపర్‌సిక్స్ టోర్నీలో కణేకల్లు ఆర్డీటీ జట్టు విజేత నిలిచింది. మొ త్తం 16 జట్లు ఈ టోర్నీలో పాల్గొనగా ఫైనల్‌కు కణేకల్లు ఆర్డీటీ జట్టు, హ నకనహాళ్ జట్టు చేరుకున్నాయి. ఫైనల్ మ్యాచలో మొదట బ్యాటింగ్ చేసి న కణేకల్లు జట్టు నిర్ణీత ఆరు ఓవర్లకు 63 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన హనకనహాళ్ జట్టు కేవలం 38 పరుగులు మాత్రమే సాధించి 26 పరుగుల తేడాతో ఓటమి చెందింది. విజేతలకు చెరువు సంఘం అధ్యక్షుడు బీటీ రమేష్, పట్టణ అధ్యక్షుడు అనిల్, హాస్పిటల్ కమిటీ సభ్యుడు కురుబ నాగరాజులు రూ. 10 వేలు, షీల్డును అందజేశారు. రన్నర్స్‌కు క్రీడాకారులు షేక్‌ఫజుల్, పురుషోత్తం, అహ్మ ద్ రూ. ఐదువేలు, కప్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అల్తాఫ్, తిప్పేస్వామి, ప్రకాష్, నితీష్, రెడ్డి, బసవరాజు, మణికంఠ పాల్గొన్నారు.