వైభవంగా కనకదాస జయంతి
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:46 PM
మండలంలోని నేమకల్లులో సోమవారం కనకదాస జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు
బొమ్మనహాళ్, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని నేమకల్లులో సోమవారం కనకదాస జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రధాన వీధుల్లో కనకదాస చిత్రపటాన్ని ఊరేగించారు. 108 మంది బాలికలు కలశాలతో ఇందులో పాల్గొన్నారు. ఇందులో టీడీపీ నాయకులు గాలి బసప్ప, బెళ్లి హనుమంతరెడ్డి, గాధిలింగ, రమేష్, కురుబ సంఘం నాయకులు పాల్గొన్నారు.