Share News

ఘనంగా కలశ పూజ

ABN , Publish Date - Oct 28 , 2025 | 11:12 PM

కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో కలశ స్థాపన, కుంభాభిషేకం కార్యక్రమంలో భాగంగా నూతన కలశాలకు అర్చకులు, వేదపండితులు మంగళవారం ఘనంగా పూజలు నిర్వహించారు.

ఘనంగా కలశ పూజ
కలశంతో టీడీపీ నాయకులు, అర్చకులు

గుంతకల్లుటౌన, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో కలశ స్థాపన, కుంభాభిషేకం కార్యక్రమంలో భాగంగా నూతన కలశాలకు అర్చకులు, వేదపండితులు మంగళవారం ఘనంగా పూజలు నిర్వహించారు. టీడీపీ గుంతకల్లు ఇనచార్జి గుమ్మనూరు నారాయణస్వామి, సింగిల్‌ విండ్‌ చైర్మన తలారి మస్తానప్ప, మండల అధ్యక్షుడు రామన్నచౌదరి నూతన కలశాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. కార్యక్రమంలో ఈఓ విజయరాజు, ధర్మకర్త సుగుణమ్మ పాల్గొన్నారు.

Updated Date - Oct 28 , 2025 | 11:12 PM