29 నుంచి కలశ ప్రతిష్ఠ మహోత్సవాలు
ABN , Publish Date - Oct 14 , 2025 | 01:22 AM
కసాపురం ఆలయ గోపురాలకు కలశ ప్రతిష్ఠ మహోత్సవాలను ఈనెల 29, 30, 31 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు.
గుంతకల్లు, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): కసాపురం ఆలయ గోపురాలకు కలశ ప్రతిష్ఠ మహోత్సవాలను ఈనెల 29, 30, 31 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. సోమవారం కసాపురం దేవస్థాన ఆవరణంలో కలశ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవస్థాన ఈఓ విజయరాజు ఆలయ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారని కితాబిచ్చారు. కసాపురం గ్రామ ప్రజలు కూడా సహకారాన్ని అందజేయడం ముదావాహ విషయమన్నారు. కలశ ప్రతిష్ఠ మహోత్సవాలకు గ్రామస్థులు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అధికారులు దేవస్థానంలో 27 అభివృద్ధి కార్యక్రమాలను ఏక కాలంలో చేపట్టడం, దా తలు అదేస్థాయిలో ముందుకు రావడం సంతోషకర విషయమన్నారు. ఆలయ ఈఓ విజయరాజు మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల అనంతరం దేవస్థానం అద్భుతంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుమ్మనూరు నారాయణ స్వామి, ధర్మకర్త సుగుణమ్మ, ప్రధాన అర్చకుడు రాఘవాచార్యులు పాల్గొన్నారు.