Kalabirava వైభవంగా కాలభైరవాష్టమి
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:55 AM
పట్టణంలోని స్వయంభు కాలభైరవస్వామి ఆలయంలో మహాకాలభైరవాష్టమి వేడుకలను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామునే స్వామివారిని అలంకరించి, పూజలు చేశారు.
ధర్మవరం, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని స్వయంభు కాలభైరవస్వామి ఆలయంలో మహాకాలభైరవాష్టమి వేడుకలను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామునే స్వామివారిని అలంకరించి, పూజలు చేశారు. ఆలయం ఎదుట అఖండ జ్యోతి వెలిగించారు. మధ్యాహ్నం పెద్దఎత్తున అన్నదానం చేపట్టారు. పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరై, కాలభైరవుడిని దర్శించుకున్నారు. సాయంత్రం స్వామివారిని రుద్రభైరవుడిగా అలంకరించి, భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.