Share News

ముగిసిన కడ్లే గౌరమ్మ ఉత్సవాలు

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:40 AM

మండలంలోని గోవిందవాడ, చంద్రగిరి గ్రామాల్లో మూడురోజులు పాటు నిర్వహిస్తున్న కడ్లేగౌరమ్మ ఉత్సవాలు ముగిశాయి.

ముగిసిన కడ్లే గౌరమ్మ ఉత్సవాలు
గోవిందవాడలో కడ్లేగౌరమ్మ ఊరేగింపు

బొమ్మనహాళ్‌, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): మండలంలోని గోవిందవాడ, చంద్రగిరి గ్రామాల్లో మూడురోజులు పాటు నిర్వహిస్తున్న కడ్లేగౌరమ్మ ఉత్సవాలు ముగిశాయి. బుధవారం తెల్లవారుజమున కడ్లే గౌరమ్మ విగ్రహాలను ప్రత్యేక రథంలో ఊరేగించి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా చెక్కభజన, కోలాటాలు, భజనలు, డప్పు వాయిద్యాలతో గ్రామాలు మార్మోగాయి. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సోమనాథ్‌గౌడ్‌, ఎస్‌జీ వన్నూరుస్వామి, రాతింటి వన్నూరుస్వామి, సుంకన్న, ధనంజయ్యరెడ్డి, చంద్రారెడ్డి, చింతకుంట చంద్రారెడ్డి, పుల్లరెడ్డి , బలరాం పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 12:40 AM