హోరాహోరీగా కబడ్డీ పోటీలు
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:03 AM
వాల్మీకి జయంతి సందర్భంగా మండలంలోని తొండపాడులో మంగళవారం నిర్వహించిన కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగాయి.
గుత్తిరూరల్, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): వాల్మీకి జయంతి సందర్భంగా మండలంలోని తొండపాడులో మంగళవారం నిర్వహించిన కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఇందులో 54 టీములు పాల్గొన్నాయి. మొదటి బహుమతి సాధించిన నంద్యాల జిల్లా ప్యాపిలికి చెందిన టీంకు రూ. 25 వేలు, రెండవ బహుమతి సాధించిన గుంతకల్లు మండలం కదిరిపల్లికి చెందిన టీం రూ. 15 వేలు అందజేశారు. కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే తనయుడు గుమ్మనూరు ఈశ్వర్, టీడీపీ మండల కన్వీనర్ లక్ష్మిరంగయ్య, మార్కెట్ యార్డు చైర్మన ప్రతాప్, ఆసుపత్రి కమిటీ సభ్యుడు చికెన శీనా, సింగల్ విండో అధ్యక్షుడు శివశంకర్, టీడీపీ నాయకులు చిన్నరెడ్డి యాదవ్, రంగస్వామిరెడ్డియాదవ్, సర్పుంచు లింగమయ్య ఓంప్రకాష్, రామాంజునేయులు, ప్రకాష్ పాల్గొన్నారు.