Share News

వైసీపీ బాధితులకు న్యాయం చేస్తా

ABN , Publish Date - Oct 03 , 2025 | 11:42 PM

వైసీపీ హయాంలో పట్టణంలో పలుచోట్ల స్థలాలను కబ్జా చేశారని, ఆ స్థలాలను విడిపించి తిరిగి ప్రజలకు అప్పగించి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు.

వైసీపీ బాధితులకు న్యాయం చేస్తా
గాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే అమిలినేని

కళ్యాణదుర్గం, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో పట్టణంలో పలుచోట్ల స్థలాలను కబ్జా చేశారని, ఆ స్థలాలను విడిపించి తిరిగి ప్రజలకు అప్పగించి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. గాంధీజయంతి సందర్భంగా స్థానిక గాంధీ సర్కిల్‌లో మహాత్ముడి విగ్రహం వద్ద, ప్రజావేదికలో గాంధీ చిత్రపటం వద్ద గురువారం నివాళులర్పించిన ఆయన మాట్లాడారు. పట్టణంలో అండర్‌ గ్రౌండ్‌ పనులు, డివైడర్లు ఏర్పాటు చేసి, కళ్యాణదుర్గం పట్టణాన్ని అభివృద్ధికి కేరాఫ్‌ అడ్ర్‌సగా మారుస్తామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన కళ్యాణ్‌, విద్యాశాఖ మంత్రి నారాలోకేశ సహకారంతో బీటీపీ కాలువ పనులను సకాలంలో పూర్తి చేసి రైతుల కలను నెరవేర్చడమే తన లక్ష్యమన్నారు.

Updated Date - Oct 03 , 2025 | 11:42 PM