Share News

tenant farmers కౌలు రైతులకు న్యాయం చేయాలి

ABN , Publish Date - Jun 04 , 2025 | 12:13 AM

మండలంలోని కౌలు రైతులను ఆదుకోవాలని కౌలు రైతు సంఘం నాయకులు రంగారెడ్డి, వెంక టేశులు కోరారు.

tenant farmers కౌలు రైతులకు న్యాయం చేయాలి
తహసీల్దారుకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

విడపనకల్లు, జూన 3(ఆంధ్రజ్యోతి): మండలంలోని కౌలు రైతులను ఆదుకోవాలని కౌలు రైతు సంఘం నాయకులు రంగారెడ్డి, వెంక టేశులు కోరారు. స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద మంగళ వారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కౌలు రైతులు ముందు గానే కౌలు చెల్లించి పంటలు సాగు చేస్తున్నారని, పంటలు పండక పోతే కనీసం చేసిన కూలి కూడా రాకుండా నష్టపోతున్నారన్నారు. కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసు కోవాలన్నారు. రైతుభరోసా, సబ్సిడీ విత్తనాలు, బ్యాంక్‌లో రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వినతిపత్రాన్ని తహసీల్దారు చంద్రశేఖరయ్యకు ఇచ్చారు.

Updated Date - Jun 04 , 2025 | 12:13 AM