ముగిసిన జూడో లీగ్ పోటీలు
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:03 AM
మండలంలోని వెంకటాద్రిపల్లి ఉన్నత పాఠశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న కళ్యాణదుర్గం జోనల్ లెవెల్ జూడోలీగ్ పోటీలు శుక్రవారంతో ముగిశా యి
బెళుగుప్ప, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వెంకటాద్రిపల్లి ఉన్నత పాఠశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న కళ్యాణదుర్గం జోనల్ లెవెల్ జూడోలీగ్ పోటీలు శుక్రవారంతో ముగిశా యి. వెంకటాద్రిపల్లి ఉన్నత పాఠశాల బాలుర జట్టు, యర్రగుంట ఉన్నత పాఠశాల బాలికలు జట్టు విజేతలుగా నిలిచినట్లు పీడీ రాఘవేంద్ర తెలిపారు. పోటీల్లో అంకంపల్లి, ఎర్రగుంట, మాకొడికి, కళ్యాణదుర్గం హనకనహాళ్ ఉన్నత పాఠశాల నుంచి 120 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు హెచఎం లక్ష్మీ శిరీష తెలిపారు. టీడీపీ నాయకులు సునీల్ రమేష్ శ్యాం బహుమతులు అందజేశారు. ు