Share News

జాబ్‌మేళాలో 149 మందికి ఉద్యోగాలు

ABN , Publish Date - Sep 23 , 2025 | 11:51 PM

స్థానిక శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన జాబ్‌మేళాలో 149 మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందినట్లు ప్రిన్సిపాల్‌ హరినాథ్‌రెడ్డి తెలిపారు.

జాబ్‌మేళాలో 149 మందికి ఉద్యోగాలు
నియామకపత్రాలతో అభ్యర్థులు, కంపెనీల ప్రతినిధులు

యాడికి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): స్థానిక శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన జాబ్‌మేళాలో 149 మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందినట్లు ప్రిన్సిపాల్‌ హరినాథ్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి జాబ్‌మేళాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏపీ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన, సీ-డాప్‌ ఆధ్వర్యంలో పది నేషనల్‌, మల్టీనేషనల్‌ కంపెనీలు ఈ జాబ్‌మేళాలో ఇంటర్వ్యూలు నిర్వహించాయన్నారు. జాబ్‌మేళాకు 266 మంది నిరుద్యోగులు హాజరుకాగా.. 149 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు.

Updated Date - Sep 23 , 2025 | 11:51 PM