Share News

Job promotions ఉద్యోగోన్నతులు కల్పించాలి

ABN , Publish Date - Jun 24 , 2025 | 12:12 AM

తమకు ఉద్యోగోన్నతులు కల్పించాలని మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయ ఉద్యోగులు సోమవారం స్థానిక మున్సిపాల్టీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

Job promotions  ఉద్యోగోన్నతులు కల్పించాలి
ఆందోళన చేస్తున్న సచివాలయ ఉద్యోగులు

కళ్యాణదుర్గం, జూన 23(ఆంధ్రజ్యోతి): తమకు ఉద్యోగోన్నతులు కల్పించాలని మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయ ఉద్యోగులు సోమవారం స్థానిక మున్సిపాల్టీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సినియారిటీ, రోస్టర్‌ జాబితా మేరకు ఉద్యోగోన్నతి కల్పించిన తర్వాతనే బదిలీలు చేపట్టాలని, జీఓ నెంబర్‌ 523 ను రద్దు చేయాలని, నోషనల్‌ ఇంక్రిమెంట్స్‌ అందరికీ వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ వంశీకృష్ణ భార్గవ్‌కు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు గణేష్‌, ఉపేంద్ర, నవీన రెడ్డి, దివ్య శిల్ప, శ్రీకాంత, మంజు, మనోజ్‌, ప్రవీణ్‌, నల్లప్ప, నీలిమ, కృష్ణయ్య, రాము, దివాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 12:12 AM