soldiers సైనికుల కోసం జనసైనికుల పూజలు
ABN , Publish Date - May 14 , 2025 | 12:05 AM
ఉపముఖ్యమంత్రి పవనకల్యాణ్ ఆదేశాల మేరకు భారత సైనికులకు భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కర్ణాటకలోని కుక్కె సుబ్రహ్మణ్యంస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేయించారు.
ధర్మవరం, మే 13(ఆంధ్రజ్యోతి): ఉపముఖ్యమంత్రి పవనకల్యాణ్ ఆదేశాల మేరకు భారత సైనికులకు భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కర్ణాటకలోని కుక్కె సుబ్రహ్మణ్యంస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేయించారు. ఇందులో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, అహుడా చైర్మన టీసీ వరుణ్ తదితరులు పాల్గొన్నారు.