అడవిని తలపిస్తున్న జగనన్న కాలనీ
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:29 AM
స్థానిక హోతూరు రహదారిలో ఉరవకొండకు రెండు కిలోమీటర్ల దూరంలో నివాసయోగ్యం కానీ చోట గత వైసీపీ ప్రభుత్వం సర్వే నెంబరు 279లో జగనన్న కాలనీని ఏర్పాటు చేసింది.
ఉరవకొండ, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): స్థానిక హోతూరు రహదారిలో ఉరవకొండకు రెండు కిలోమీటర్ల దూరంలో నివాసయోగ్యం కానీ చోట గత వైసీపీ ప్రభుత్వం సర్వే నెంబరు 279లో జగనన్న కాలనీని ఏర్పాటు చేసింది. 84 మందికి ఇళ్లపట్టాలను పంపిణీ చేసింది. లబ్ధిదారులు ఎవరూ అక్కడ ఇళ్లను నిర్మించుకోవడానికి ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం ఆ లేఅవుట్ అంతా ఇలా ముళ్ల పొదలతో నిండిపోయింది.