apologize జగన క్షమాపణ చెప్పాలి
ABN , Publish Date - Jun 09 , 2025 | 12:07 AM
రాష్ట్ర రాజధాని అమరావతిని వేశ్యల రాజధాని అంటూ జగన చానల్ వేదికగా జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసులు, కృష్ణంరాజు వ్యాఖ్యలు చేయడం.. జగన పత్రికలో ప్రచురించడంపై తెలుగు మహిళలు ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్ : రాష్ట్ర రాజధాని అమరావతిని వేశ్యల రాజధాని అంటూ జగన చానల్ వేదికగా జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసులు, కృష్ణంరాజు వ్యాఖ్యలు చేయడం.. జగన పత్రికలో ప్రచురించడంపై తెలుగు మహిళలు ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మహిళలకు మాజీ సీఎం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, ఆ జర్నలిస్టులపై కేసు నమో దు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చే శారు. పలు ప్రాంతాల్లో జగన పత్రికలను దహ నం చేసి నిరసన వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గంలో తెలుగుమహిళలు పట్టణ పోలీ్‌సస్టేషన ఎదుట నినాదాలు చేశారు. రాయదుర్గంలో జర్నలిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసులుపై కేసు నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు భారతి పట్టణ ఎస్‌ఐ ప్రసాద్‌బాబుకు వినతిపత్రం అం దించారు. ఉరవకొండలో టీడీపీ మహిళ విభా గం నాయకురాళ్లు కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్టు కృష్ణమరాజు ఫొటోలను చెప్పులతో కొ డుతూ నిరసన వ్యక్తం చేశారు. తాడిపత్రిలో జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులను అరెస్ట్ చేయాలని మున్సిపల్ వైస్ చైర్మన అరుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంతకల్లులో ఆ జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళ పార్లమెంటరీ కమిటీ ఉపాధ్యక్షురాలు తలారి సరోజమ్మ ఆధ్వర్యంలో నాయకురాళ్లు పోలీసులకు ఫిర్యాదుచేశారు. పుట్లూరులో టీడీపీ మహిళా నాయకురాలు వరలక్ష్మి ఎస్‌ఐ వెంకటనరసింహంకు ఫిర్యాదు చేశారు.