Jagan సచివాలయంలో జగన ఫ్లెక్సీలు
ABN , Publish Date - May 22 , 2025 | 12:21 AM
స్థానిక సచివాలయం-2లో నేటికీ మాజీ సీఎం జగన్మోహనరెడ్డి ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు సంబంధించిన నిలువెత్తు భారీ ఫ్లెక్సీలను ప్రదర్శనకు ఉంచారు.
బత్తలపల్లి, మే 21(ఆంధ్రజ్యోతి): స్థానిక సచివాలయం-2లో నేటికీ మాజీ సీఎం జగన్మోహనరెడ్డి ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు సంబంధించిన నిలువెత్తు భారీ ఫ్లెక్సీలను ప్రదర్శనకు ఉంచారు. బుధవారం ఆ సచివాలయానికి వెళ్లిన టీడీపీ నాయకులు దీన్ని గమనించి.. ఆ సిబ్బందిని నిలదీశారు. కనీసం ఫ్లెక్సీలను తిప్పిపెట్టకుండా.. ఇలా ప్రదర్శనకు ఉంచడం ఏమిటని ప్రశ్నించా రు. దీనికి ఆ ఉద్యోగులు సమాధానం చెప్పకుండా.. అక్కడి నుంచి జారుకున్నారు. ప్రభుత్వం మారినా ఇంకా కొందరి సచివాలయ ఉద్యోగుల తీరు మారడం లేదని, ఉద్యోగుల్లా కాకుండా వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆ నాయకులు ధ్వజమెత్తారు. ఈ కార్యాయంలోని పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వ ఉద్యోగి అనే విషయాన్ని మరచి.. కార్యాలయానికి వచ్చే వారివద్ద నిత్యం కూటమి ప్రభుత్వంపై నిందలు వేస్తూ.. వైసీపీని, జగనను పొడుగుతున్నాడని ఆరోపించారు. ఆయన సచివాలయంలో అందుబాటులో ఉండటం లేదని, కనీసం ఫోన చేస్తే లిఫ్ట్ కూడా చేయడం లేదని అన్నారు. ఇలాంటి వారి వల్ల మిగిలిన సచివాలయాల ఉద్యోగులకు చెడ్డ పేరు వస్తోందన్నారు. కార్యక్రమంలో నెట్టిం రమణ, సదాశివ, శ్రీరాములు, హరి, నాగార్జున పాల్గొన్నారు.