Is this ban ప్లాస్టిక్ నిషేధం ఇదేనా..?
ABN , Publish Date - Jun 16 , 2025 | 12:40 AM
ఏటా జూన మాసం రాగానే అధికారులకు పర్యావరణ పరిరక్షణ గుర్తుకు వస్తుంది. రీసైక్లింగ్ కానీ ప్లాస్టిక్‌ను అరికడతామంటూ ఆర్భాటంగా ప్రకటనలు ఇస్తారు.

యాడికి, జూన 15(ఆంధ్రజ్యోతి): ఏటా జూన మాసం రాగానే అధికారులకు పర్యావరణ పరిరక్షణ గుర్తుకు వస్తుంది. రీసైక్లింగ్ కానీ ప్లాస్టిక్‌ను అరికడతామంటూ ఆర్భాటంగా ప్రకటనలు ఇస్తారు. తర్వాత దాని గురించి ఏ మాత్రం పట్టించుకోరు. దీంతో వ్యాపారులు, ప్రజలు యథేచ్చగా నిషేధిత ప్లాస్టిక్ కవర్లను వాడి పారేస్తున్నారు. ఆ దివారం యాడికిలోని సంత వద్ద ప్లాస్టిక్ కవర్ల ఇలా కుప్పగా వేశారు. వాటిని తింటూ మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.