Share News

ప్రత్యామ్నాయం అందేనా..?

ABN , Publish Date - Sep 14 , 2025 | 12:23 AM

ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీ ఊసేలేకుండా పోయింది. ఆ ఊసే వినిపించట్లేదు. ఖరీఫ్‌ సీజన ముగింపు దశకు చేరుకుంటున్నా.. విత్తనాలు పంపిణీ చేయకపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

ప్రత్యామ్నాయం అందేనా..?

జిల్లాకు 15 వేల క్వింటాళ్లతో ప్రతిపాదనలు

నేటికీ సరఫరాకాని ప్రత్యామ్నాయ విత్తనాలు

ముగింపు దశకు ఖరీఫ్‌

ఫ బయట కొనుగోలు చేస్తున్న రైతులుమడకశిర, సెప్టెంబరు13(ఆంధ్రజ్యోతి): ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీ ఊసేలేకుండా పోయింది. ఆ ఊసే వినిపించట్లేదు. ఖరీఫ్‌ సీజన ముగింపు దశకు చేరుకుంటున్నా.. విత్తనాలు పంపిణీ చేయకపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పొలాలను సిద్ధం చేసుకుని, ఎదురుచూస్తున్నారు. జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఆ తరువాతి ప్రక్రియే మొదలుకాలేదు. ఏటా ఆగస్టు మొదటి వారంలోనే పంపిణీ చేసేవారు. ఈ సారి సెప్టెంబరు సగం నెల గడుస్తున్నా.. ఆ ఊసేలేకపోవడంతో అన్నదాతలు ఆశలు వదులుకుంటున్నారు. కొందరు బయట మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు చేసి, పంట పెడుతున్నారు. ఇంకొందరు ఇంకా ఎదురు చూస్తున్నారు. ఖరీ్‌ఫలో తీవ్ర వర్సాభావ పరిస్థితుల కారణంగా పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. రైతన్నలు ప్రత్యామ్నాయ పంటల సాగుకు సన్నద్ధమయ్యారు. అఽధికారులు ప్రత్యమ్నాయ విత్తనాల కోసం ప్రతిపాదనలు పంపినా సరఫరాలో జాప్యం చేస్తున్నారు. భూములను సిద్ధం చేసుకున్న రైతులు.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పంట వేయాలని భావిస్తున్నారు. విత్తనాలు సరఫరా చేయకపోవడంతో నిరాశ చెందుతున్నారు. జిల్లాలో 60 వేల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు 15వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని వ్యవసాయాధికారులు ప్రతిపాదనలు పంపారు. నేటికీ పంపీణి చేయలేదు.

Updated Date - Sep 14 , 2025 | 12:23 AM