tenant farmers. కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించాలి
ABN , Publish Date - Jun 10 , 2025 | 01:34 AM
భూమి లేని కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సహాయం అందించాలని సీపీఐ నాయకులు సోమవారం డిమాండ్ చేశారు

ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్: భూమి లేని కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సహాయం అందించాలని సీపీఐ నాయకులు సోమవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంతకల్లు, గుత్తి, పుట్టూరు, యాడికి, డీ.హీరేహాళ్, పెద్దవడుగూరులో ఆ పార్టీ నాయకులు ఆయా తహసీల్దారు కార్యాలయాల వద్ద ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, 90 శాతం సబ్సిడీతో నాణ్యమైన అన్ని రకాల పంట విత్తనాలు అందించాలని, రూ.5లక్షల వరకు పంట రుణాలను అందించాలని డిమాండ్ చేశారు. గుంతకల్లులో ఏపీ రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసెడెంట్ గోవిందు, గుత్తిలో సీపీఐ మండల కార్యదర్శి రామదాసు, పుట్టూరులో కౌలురైతు సంఘం నాయకుడు రామాంజనేయులు, యాడికిలో ఏపీ రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరాముడుయాదవ్, డీ.హీరేహాళ్‌లో సీపీఐ తాలూకా కార్యదర్శి నాగార్జున, పెద్దవడుగూరులో సీపీఐ సీనియర్ నాయకుడు నారాయణ ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు చేపట్టారు.