బాలుడి మృతిపై విచారణ
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:32 AM
: పట్టణంలోని సీహెచసీ ఆసుపత్రిలో ఈనెల 26న చాబాల గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలుడు అహరూన కుమార్ మరణించిన ఘటనపై ప్రత్యేక బృందం అధికారులు సోమవారం విచారణ చేపట్టారు.
ఉరవకొండ, సెప్టెంబరు29(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని సీహెచసీ ఆసుపత్రిలో ఈనెల 26న చాబాల గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలుడు అహరూన కుమార్ మరణించిన ఘటనపై ప్రత్యేక బృందం అధికారులు సోమవారం విచారణ చేపట్టారు. ఈ మరణానికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని బాధితులు ఆరోపించిన నేపథ్యంలో దీనిపై సమగ్ర విచారణకు కలెక్టర్ ముగ్గురు అధికారులతో ఈ బృందాన్ని నియమించారు. ఆరోపణలున్న వైద్యుడు ఇస్మాయిల్‌ను సస్పెండ్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అధికారులు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. బృందంలోని సభ్యులు డీఎంహెచఓ ఈబీ దేవి, అనంతపురం సర్వజన ఆసుపత్రి పీడీయాట్రీషన లోక్‌నాథ్, డీసీహెచ డేవిడ్ సెల్వరాజ్ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు పంపతున్నట్లు వారు తెలిపారు.