Share News

నిధుల దుర్వినియోగంపై విచారణ

ABN , Publish Date - Sep 13 , 2025 | 12:00 AM

స్థానిక గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై గుంతకల్లు డీఎల్‌పీఓ విజయలక్ష్మి శుక్రవారం విచారణ చేపట్టారు.

నిధుల దుర్వినియోగంపై విచారణ
అవినీతిపై విచారణ చేస్తున్న డీఎల్‌పీఓ

యాడికి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): స్థానిక గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై గుంతకల్లు డీఎల్‌పీఓ విజయలక్ష్మి శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ గ్రామపంచాయతీలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన వరకు నిధుల దుర్వినియోగమయ్యాయని సీపీఎం నాయకులు పీజీఆర్‌ఎ్‌సలో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ విచారణ చేపట్టారు. బిల్లులు, ఎం- బుక్కులను పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నివేదిక తయారుచేయడానికి మూడురోజులు పడుతుందని, ఆ సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని డీఎల్‌పీఓ తెలిపారు. విచారణలో డిప్యూటి ఎంపీడీఓలు దామోదర్‌రెడ్డి, శశికళ, సర్పంచు అనురాధ, గతంలో పనిచేసిన పంచాయతీ సెక్రటరీ అశ్వర్థమనాయుడు, జూనియర్‌ అసిస్టెంట్‌ లక్ష్మేంద్ర పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2025 | 12:00 AM