ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతిపై విచారణ
ABN , Publish Date - Aug 25 , 2025 | 11:48 PM
ఉపాధిహామీ పథకంలో నిట్టూరు ఫీల్డ్ అసిస్టెంట్ రంగస్వామి అవినీతిపై సామాజిక తనిఖీ ప్రజావేదికలో పలువురు కూలీలు ఇచ్చిన ఫిర్యాదుకు ఉన్నతాధికారులు స్పందించారు.
యాడికి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): ఉపాధిహామీ పథకంలో నిట్టూరు ఫీల్డ్ అసిస్టెంట్ రంగస్వామి అవినీతిపై సామాజిక తనిఖీ ప్రజావేదికలో పలువురు కూలీలు ఇచ్చిన ఫిర్యాదుకు ఉన్నతాధికారులు స్పందించారు. సోమవారం ఉపాధిహామీ పథకం జిల్లా విజిలెన్స అధికారి శ్రీనివాసులు విచారణ చేపట్టారు. ఫిర్యాదు చేసిన వ్యక్తులను స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి పిలిపించి విచారించారు. ఐదుగురు వ్యక్తులు ఫిర్యాదు చేయగా విచారణకు ముగ్గురు హాజరయ్యారు. తాము ఉపాధి పనులకు వెళ్లకపోయినా పనులకు వచ్చినట్లు నమోదుచేశాడని, కూలి డబ్బుల్లో వాటా తీసుకున్నాడని వారు విజిలెన్స అధికారికి వివరించారు. ఫీల్డ్ అసిస్టెంట్ కూడా విజిలెన్స అధికారుల ఎదుట హాజరయ్యారు. జిల్లాకేంద్రంలోని కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని ఆయన్ను ఆదేశించారు. ఈ విచారణలో విజిలెన్స సిబ్బంది మల్లికార్జున, పర్వేజ్, యాడికి ఎంపీడీఓ వీరరాజు, ఉపాధిహామీ పథకం ఏపీఓ మద్దిలేటి పాల్గొన్నారు