ఆలయానికి విద్యుత లైట్ల ఏర్పాటు
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:10 AM
మండలంలోని గడేకల్లులో కొండపై వెలసిన చౌడేశ్వరి అమ్మవారి ఆలయానికి విద్యుత లైట్లు ఏర్పాటు చేశారు.
విడపనకల్లు, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని గడేకల్లులో కొండపై వెలసిన చౌడేశ్వరి అమ్మవారి ఆలయానికి విద్యుత లైట్లు ఏర్పాటు చేశారు. కొండపై వెలసి అమ్మవారి ఆలయం వద్ద వేములవాడ భీమలింగేశ్వరస్వామి తపస్సు చేశాడని, అనంతరం అక్కడి నుంచి వచ్చి కొండ కింద ఉన్న గడేకల్లులో జీవ సమాధి అయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. కొండపై ఉన్న ఆలయాలకు అనేక ఏళ్లుగా విద్యుత సౌకర్యం లేదు. పయ్యావుల సోదరుల ఆదేశాల మేరకు గడేకల్లు టీడీపీ నాయకులు కొండపై ఆలయాలకు విద్యుత సౌకర్యం కల్పించారు.