Share News

street lights వీధిదీపాలు ఏర్పాటు చేయండి

ABN , Publish Date - Apr 17 , 2025 | 11:28 PM

స్థానిక 30 పడకల ఆసుపత్రికి వెళ్లే దారిలో వీఽధి దీపాలు లేక రాత్రి సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయమని స్థానికులు వాపోతున్నారు.

street lights వీధిదీపాలు ఏర్పాటు చేయండి
నల్లమాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే దారి

నల్లమాడ, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): స్థానిక 30 పడకల ఆసుపత్రికి వెళ్లే దారిలో వీఽధి దీపాలు లేక రాత్రి సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయమని స్థానికులు వాపోతున్నారు. పుట్టపర్తి ప్రధాన రహదారి నుంచి ఉండే రహదారికి ఇరువైపు గడ్డి ఏపుగా పెరిగింది. దీంతో అక్కడ విషపురుగులు, పాములు ఎక్కువగా సంచురిస్తున్నాయి. రాత్రి సమయంలో రోగులు ఆ ఆసుపత్రికి నడిచి వెళ్లాలంటే రోగులు, సిబ్బంది ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ రహదారిలో వీధి దీపాలు ఏర్పాటు చేస్తే విషపురుగుల ప్రమాదం నుంచి బయటపడే అవకాశముంది. అధికారులు, నాయకులు స్పందించి ఈ రహదారిలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Apr 17 , 2025 | 11:28 PM