inspection: కియ పరిసరాల్లో పటిష్ట నిఘా: ఎస్పీ
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:11 AM
కియ ప్రాంతంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట నిఘా ఉంచాలని ఎస్పీ రత్న ఆదేశించారు. పోలీస్ స్టేషనను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. పరిశ్రమ చుట్టుపక్కల గ్రామాల్లో ఎప్పటికప్పుడు గట్టి నిఘా ఉంచాలన్నారు.

పెనుకొండ రూరల్, మార్చి 11(ఆంధ్రజ్యోతి): కియ ప్రాంతంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట నిఘా ఉంచాలని ఎస్పీ రత్న ఆదేశించారు. పోలీస్ స్టేషనను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. పరిశ్రమ చుట్టుపక్కల గ్రామాల్లో ఎప్పటికప్పుడు గట్టి నిఘా ఉంచాలన్నారు. అనంతరం స్టేషనలో రికార్డులు పరిశీలించారు. పెండింగ్ కేసులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు రాఘవన, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.