crop బాధిత రైతు పొలం పరిశీలన
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:08 AM
నకిలీ విత్తనాలతో నష్టపోయిన మండలంలోని డి.చెర్లోపల్లికి చెందిన మురళి పొలాన్ని హార్టికల్చర్ అధికారి అమరేశ్వరి, ఏఓ ఓబిరెడ్డి గురువారం పరిశీలించారు.

బత్తలపల్లి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): నకిలీ విత్తనాలతో నష్టపోయిన మండలంలోని డి.చెర్లోపల్లికి చెందిన మురళి పొలాన్ని హార్టికల్చర్ అధికారి అమరేశ్వరి, ఏఓ ఓబిరెడ్డి గురువారం పరిశీలించారు. మురళి తనకున్న 3.74 ఎకరాల పొలంలో కలింగర మాక్స్ రకాన్ని సాగు చేశాడు. పంట కాల పరిమితి 75రోజులు దాటినా కాయ లోపల తెలుపు ఉండడంతో నకిలి విత్తనాల వల్ల నష్టపోయనని గుర్తించాడు. బుధవారం అత్మహత్యాయత్నం చేసుకోగా.. అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో అధికారులు ఆ రైతు పొలాన్ని గురువారం పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. వారి వెంట వ్యవసాయాధికారి నాగార్జున ఉన్నారు.