పవర్ గ్రిడ్ పనుల పరిశీలన
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:56 PM
మండలంలోని కొలగనహళ్లి, ఎల్బీనర్ గ్రామాల పరిధిలో జరుగుతున్న పవర్ గ్రిడ్ పనులను కళ్యాణదుర్గం ఆర్డీవో వసంతబాబు మంగళవారం పరిశీలించారు.
బొమ్మనహాళ్, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొలగనహళ్లి, ఎల్బీనర్ గ్రామాల పరిధిలో జరుగుతున్న పవర్ గ్రిడ్ పనులను కళ్యాణదుర్గం ఆర్డీవో వసంతబాబు మంగళవారం పరిశీలించారు. మొత్తం 197 ఎకరాల్లో ఆర్‌ఈజెడ్ కంపెనీ ద్వారా పవర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నారు.
రీసర్వేపై గ్రామసభ : ఏళాంజిలో రీసర్వేపై ఆర్డీవో గ్రామసభ నిర్వహించారు. రీసర్వే సమయంలో రైతులు తమ భూములకు సంబంధించిన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఎలాంటి సందేహాలు, అభ్యంతరాలు ఉన్నా గ్రామ సభల్లో తెలియజేయాలని, వాటిని అఽధికారులు పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు. ఇప్పటి వరకు రీసర్వే పూర్తీయిన గ్రామాలకు చెందిన పట్టాదారు పాసుపుస్తకాలను జనవరి 2వ తేదీ నుంచి పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మునివేలు, సర్వేయర్ రవితేజ పాల్గొన్నారు.