బీటీపీ కాలువ పనుల పరిశీలన
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:24 AM
మండలంలోని బోరంపల్లి వద్ద జరుగుతున్న బీటీపీ కాలువ పనులను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, టీడీపీ నాయకుడు రాజగోపాల్ మంగళవారం పరిశీలించారు.
కళ్యాణదుర్గం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): మండలంలోని బోరంపల్లి వద్ద జరుగుతున్న బీటీపీ కాలువ పనులను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, టీడీపీ నాయకుడు రాజగోపాల్ మంగళవారం పరిశీలించారు. నియోజకవర్గంలో ఇప్పటికే మూడు చోట్ల కాలువ పనులు శరవేగంగా సాగుతున్నాయని ఇంజినీర్లు వారికి వివరించారు. కుందుర్పి మండలం బ్రాంచ కెనాల్, బ్రహ్మసముద్రం మండలం సమీపంలోని వెస్ట్ కోడిపల్లి, కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి నుంచి దుద్దేకుంట ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయన్నారు. జాప్యం లేకుండా కాలువ పనులన్నీ వేగవంతంగా చేయాలని వారు ఇంజనీర్లకు సూచించారు.