Inspection ఆర్టీసీ బస్టాండులో తనిఖీ
ABN , Publish Date - Jun 16 , 2025 | 12:39 AM
స్థానిక ఆర్టీసీ బస్టాండ్, డిపోనుఆర్టీసీ రీజనల్ చైర్మన పూల నాగరాజు, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన వెంకటశివుడు యాదవ్ ఆదివారం తనిఖీ చేశారు.

గుత్తి,జూన 15(ఆంధ్రజ్యోతి): స్థానిక ఆర్టీసీ బస్టాండ్, డిపోనుఆర్టీసీ రీజనల్ చైర్మన పూల నాగరాజు, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన వెంకటశివుడు యాదవ్ ఆదివారం తనిఖీ చేశారు. పామిడి మండలం కట్టకింద పల్లి గ్రామం నుంచి పామిడికి బస్సు సౌకర్యం కల్పించాలని, ఆ గ్రామం నుంచి 90 మందిపైగా విద్యార్థులు పామిడికి పాఠశాల, కళాశాలకు వెళ్తున్నారని వారిని గ్రామస్థులు కోరారు. వారి వెంట టీడీపీ నాయకులు నరేంద్రచౌదరి, సుధాకర్‌నాయుడు, పవనకుమార్ యాదవ్, బీజేపీ పట్టణ కన్వీనర్ బాలకృష్ణ ఉన్నారు.