ఆలయ ఆదాయంపై విచారణ
ABN , Publish Date - Sep 22 , 2025 | 11:44 PM
మండలంలోని ఉంతకల్లులో రుక్మిణీ పాండురంగస్వామి దేవాలయ ఆదాయంపై దేవదాయశాఖ అధికారి బాబు సోమవారం విచారణ చేశారు.
బొమ్మనహాళ్, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉంతకల్లులో రుక్మిణీ పాండురంగస్వామి దేవాలయ ఆదాయంపై దేవదాయశాఖ అధికారి బాబు సోమవారం విచారణ చేశారు. కళ్యాణ మండపాలు, గదులు, రథోత్సవం, శ్రీవారి నగలు, హుండీ ఆదాయంలో అవకతవకలు జరగుతున్నాయని ఈ గ్రామానికి చెందిన కెంచప్ప, మరికొందరు ఫిర్యాదు చేశారని, దీంతో జిల్లా అసిస్టెంట్ కమిషనర్ తిరుమల రెడ్డి అదేశాలు మేరకు తాను విచారణ చేసినట్లు ఆయన తెలిపారు. నివేదికను ఉన్నతాధికారులు సమర్పిస్తామని ఈఓ బాబు తెలిపారు.