Innovative సీహెచఓల వినూత్న నిరసన
ABN , Publish Date - Apr 30 , 2025 | 11:27 PM
వైద్యఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్‌మిషన కింద విధులు నిర్వహిస్తున్న సీహెచఓల నిరవధిక సమ్మె మూడో రోజైన బుధవారమూ కొనసాగింది.
పుట్టపర్తిరూరల్, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): వైద్యఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్‌మిషన కింద విధులు నిర్వహిస్తున్న సీహెచఓల నిరవధిక సమ్మె మూడో రోజైన బుధవారమూ కొనసాగింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ముందు ఒంటి కాలిపై నిలబడి వారు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏపీఎంసీఏ జిల్లా అధ్యక్షుడు కార్తీక్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ నందీశ్వర్‌రెడ్డి, చందన, వేణుగోపాల్ పెద్దఎత్తున సీహెచఓలు, తదితరులు పాల్గొన్నారు.