Share News

‘కాపు, బలిజ కులస్థులకు అన్యాయం’

ABN , Publish Date - Sep 22 , 2025 | 11:50 PM

కూటమి ప్రభుత్వ హయాంలో కాపు, బలిజ కులస్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్థన విమర్శించారు.

‘కాపు, బలిజ కులస్థులకు అన్యాయం’
మాట్లాడుతున్న కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు

గుంతకల్లుటౌన, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ హయాంలో కాపు, బలిజ కులస్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్థన విమర్శించారు. స్థానిక శ్రీ కృష్ణదేవరాయ బలిజ కల్యాణ మండపంలో సోమవారం ఆయన మాట్లాడారు. దొమ్మరి కులస్థులను బలిజ కులస్థుల్లో చేర్చడం అన్యాయమన్నారు. బలిజ, కాపు వర్గాల ద్వారా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభు త్వం .. తిరిగి అదే బలిజ వర్గానికి అన్యాయం చేస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో, నామినేటెడ్‌ పదవులలో బలిజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఈసమావేశంలో శ్రీకృష్ణదేవరాయ ఎంప్లాయీస్‌ జేఏసీ కన్వీనర్‌ రామకృష్ణ, పట్టణ బలిజ సంఘం అధ్యక్షుడు పూల రమణ, కార్యదర్శి గోవిందరాజులు, కోశాధికారి సంజీవరాయుడు, మునిశ్వరప్ప, వెంకటేశ్వరరావు, బీమన్న, మల్లికార్జున, వక్కల ఉమ, సత్య పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2025 | 11:50 PM