టీచర్ల నియామకంలో అన్యాయం
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:40 AM
మండల విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల నూతన ఉపాధ్యాయుల నియామకంలో మండలానికి చాలా అన్యాయం జరిగిందని మురడి ఎంపీటీసీ గంగాధర ఆగ్రహం వ్యక్తం చేశారు.
డీ.హీరేహాళ్, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): మండల విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల నూతన ఉపాధ్యాయుల నియామకంలో మండలానికి చాలా అన్యాయం జరిగిందని మురడి ఎంపీటీసీ గంగాధర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక మండల ప్రజాపరిషత కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో టీచర్ల ఖాళీలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లడంలో విఫలమయ్యారని, దీంతో మండలానికి తక్కువ సంఖ్యలో ఉపాధ్యాయులను కేటాయించారని అన్నారు. అలాగే పలు సచివాలయాల్లో ఎనర్జీ అసిస్టెంట్లు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, విధులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని కొందరు సభ్యులు మండిపడ్డారు. ఈ సమస్యలపై సమావేశంలో ప్రజాప్రతినిధులు అధికారులతో వాదనకు దిగారు. ఇందులో ఎంపీపీ పవిత్ర వన్నూరుస్వామి, ఎంపీడీఓ దాస్‌నాయక, విద్యాశాఖ అధికారి సనోవర్‌బాషా పాల్గొన్నారు.