టీడీపీలోకి స్వతంత్ర కౌన్సిలర్
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:42 AM
స్థానిక మున్సిపల్ 15వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ గౌతమి టీడీపీలోకి చేరారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్వగృహంలో ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ ఆధ్వ ర్యంలో ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు
కళ్యాణదుర్గం, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): స్థానిక మున్సిపల్ 15వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ గౌతమి టీడీపీలోకి చేరారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్వగృహంలో ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ ఆధ్వ ర్యంలో ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ నాయకులకు అభివృద్ధి చేయడం చేతకాక, కులాలను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతూ.. తమ ఉనికిని కాపా డుకుంటున్నారన్నారు. ప్రజలు ఇలాంటి నీచ సంస్కృతికి సహిం చరని, ఇప్పటికైనా వాటిని మానుకోవాలని హితవు పలికారు.