సోలార్ ప్రాజెక్టుతో రైతులకు ఆదాయం
ABN , Publish Date - Oct 19 , 2025 | 11:38 PM
సోలార్ ప్రాజెక్టుకు భూములు లీజుకు ఇచ్చిన రైతులకు మంచి ఆదాయం లభిస్తుందని శ్రీశక్తి ఇంటిగ్రేటెడ్ సోలార్ అగ్రికల్చర్ ప్రాజెక్టు చైర్మన, మేనేజింగ్ డైరెక్టర్ చెరకు అనిల్ దయాకర్ తెలిపారు.
కళ్యాణదుర్గం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): సోలార్ ప్రాజెక్టుకు భూములు లీజుకు ఇచ్చిన రైతులకు మంచి ఆదాయం లభిస్తుందని శ్రీశక్తి ఇంటిగ్రేటెడ్ సోలార్ అగ్రికల్చర్ ప్రాజెక్టు చైర్మన, మేనేజింగ్ డైరెక్టర్ చెరకు అనిల్ దయాకర్ తెలిపారు. ఆదివారం కంబదూరు మండలం రాంపురం గ్రామంలో సోలార్ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ దయాకర్ మాట్లాడుతూ.. వెనుకబడిన ప్రాంతంలో అభివృద్ధి కోసం రైతులు 2,600 ఎకరాల భూములు లీజుకు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశారన్నారు. లీజు రైతులకు కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. ఎకరాకు రూ. 33 వేల ప్రకారం సంవత్సరానికి లీజు చెల్లిస్తామని తెలిపారు. సోలార్ ప్రాజెక్టుకు భూములు లీజుకు ఇచ్చిన వారి కుటుంబంలో ఒక రేషనకార్డుకు ఒక ఉద్యోగం.. విద్యార్హతను బట్టి నెలకు రూ. 20 వేల నుంచి రూ. 50 వేల వరకు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు వస్తే బ్యాంకు తరహాలో కంపెనీ రుణ సహాయం చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కంపెనీ డైరెక్టర్ జయంత జెట్టి రామచంద్ర, రీజనల్ డైరెక్టర్ సూర్యం, తెలంగాణ డైరెక్టర్ బాబన్న పాల్గొన్నారు.