Inchage Collector ప్రాధాన్య అంశాలపై దృష్టి పెట్టండి
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:54 PM
ప్రభుత్వ ప్రాధాన్య అంశాలపై ప్రత్యేక దృష్టిని సారించి, అమలు చేయాలని జిల్లా ఇనచార్జ్ కలెక్టర్ శివనారాయణశర్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి డివిజన, మండల స్థాయి అధికారులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స నిర్వహించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా ఇనచార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ
అనంతపురం కలెక్టరేట్, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ప్రాధాన్య అంశాలపై ప్రత్యేక దృష్టిని సారించి, అమలు చేయాలని జిల్లా ఇనచార్జ్ కలెక్టర్ శివనారాయణశర్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి డివిజన, మండల స్థాయి అధికారులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స నిర్వహించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. వివిధ రీతుల్లో వచ్చిన ఫిర్యాదులపై స్పందించి అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్య పరిష్కరించాలన్నారు. పంచాయతీ పరిధిలో పారిశుధ్య పనులు క్రమం తప్పకుండా చేపట్టాలన్నారు. పౌరసరఫరాలు, పీజీఆర్‌ఎస్, ఐవీఆర్‌ఎస్, చుక్కల భూముల ప్రక్రియ తదితర అంశాలలో పురోగతి సాధించాలన్నారు. తహసీల్దార్లు, సీఎ్‌సడీటీలు ఎఫ్‌పీ షాపులు తనిఖీ చేసి, నిత్యావసర సరుకులు సరిగా అందేలా చూడాలన్నారు. గుంతకల్లు, ఉరవకొండ, బొమ్మనహాళ్, పామిడి, యల్లనూరు, యాడికి మండలాల్లో రీ ఓపెన కేసులున్నాయని, వాటిని సత్వరమే పూర్తి చేయాలన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ సచిన రహార్, అనంతపురం ఆర్డీఓ కేశవనాయుడు తదితరులు పాల్గొన్నారు.