ఎడతెరపి లేని వర్షాలు
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:09 AM
మండలంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. 78.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
యల్లనూరు, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): మండలంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. 78.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. యల్లనూరు చెరువులోకి ఎర్రవంక, కట్టుకాలువ, నడిమివంకలు ఉధృతంగా ప్రవహించడంతో చెరువు నిండి మరువ పారింది. మండల పైభాగంలో వర్షం కురవడంతో చిత్రావతిలో నీటి ఉధృతి ఎక్కువైంది. వరి, మొక్కజొన్న, పప్పుశనగ వంటి పొలాలు నీట మునిగాయి.