తాగునీటి పంప్‌హౌస్ ప్రారంభం
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:46 PM
అ మృత పథకం కింద నిర్మించిన తాగునీటి పంప్‌హౌ్‌సను మున్సిపల్ చైర్‌పర్సన ఎన భవాని, టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ స్వామి మంగళవారం ప్రారంభించారు
గుంతకల్లు, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): అ మృత పథకం కింద నిర్మించిన తాగునీటి పంప్‌హౌ్‌సను మున్సిపల్ చైర్‌పర్సన ఎన భవాని, టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ స్వామి మంగళవారం ప్రారంభించారు. పంపులను స్విచాన చేసిన వీరు తాగునీటి సరఫరాను ఆరంభించారు. భవాని మాట్లాడుతూ అమృత-1 ఫేజ్-2 కింద పట్టణంలోని శివారు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను మెరుగుపరచేందుకు ఈ పంప్‌హౌస్ ఉపయోగపడుతుందన్నారు. గుమ్మనూరు నారాయణ స్వామి మాట్లాడుతూ... 2017లో అమృత పథకం కింద ఈ పనులను ప్రారంభించారని, కొన్ని కారణాలతో ఆ పనులు పూర్తికాలేదని, ప్రస్తుతం ప్రతిబంధకాలను అధిగమించి పూర్తి చేశామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నయ్యీం అహ్మద్, పబ్లిక్ హెల్త్ ఈఈ ఆదినారాయణ, డీఈఈ కేతర్ కుమార్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీరు ఇంతియాజ్ ఆలీ, టీడీపీ నాయకుడు తలారి మస్తానప్ప పాల్గొన్నారు.