Share News

fire అక్రమంగా నిల్వ ఉంచిన టపాసుల పేలుడు

ABN , Publish Date - Mar 14 , 2025 | 12:06 AM

స్థానిక జాతీయ రహ దారి పక్కనే ఉన్న దామోదర వేరుశనగ ఫ్యాక్టరీలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ. ఐదు లక్షల విలువైన టపాసులు పేలడంతో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది

fire అక్రమంగా నిల్వ ఉంచిన టపాసుల పేలుడు
చెలరేగుతున్న మంటలు

నల్లచెరువు మార్చి 13(ఆంధ్రజ్యోతి): స్థానిక జాతీయ రహ దారి పక్కనే ఉన్న దామోదర వేరుశనగ ఫ్యాక్టరీలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ. ఐదు లక్షల విలువైన టపాసులు పేలడంతో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గంట వ్యవధిలో నిల్వ ఉంచిన టపసులు మొత్తం కాలిపోయాయి. అంతే కాకుండా ఆ గది పక్కనే నిల్వ ఉంచిన రూ.రెండు లక్షల విలువైన కర్బూజా కాయలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. సమీపంలో ఇళ్లు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పినట్లైంది. ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని.. మంటలను అదుపు చేసింది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Mar 14 , 2025 | 12:06 AM