illegal affair: వివాహేతర బంధానికి అడ్డమనే హత్య !
ABN , Publish Date - Aug 10 , 2025 | 12:33 AM
మండలంలోని సడ్లపల్లి పంచాయతీ తిలక్‌నగర్‌లో ఈనెల 2న వెలుగు చూసిన హత్యకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ నరేంద్ర తెలిపారు. తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని షేక్ దాదాపీర్‌ను(28) ఆయన భార్య ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి స్థానిక పోలీస్ స్టేషనలో అరెస్టు వివరాలను విలేకరులకు శనివారం వివరించారు.
భార్య సహా ఐదుగురి అరె స్ట్
లేపాక్షి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): మండలంలోని సడ్లపల్లి పంచాయతీ తిలక్‌నగర్‌లో ఈనెల 2న వెలుగు చూసిన హత్యకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ నరేంద్ర తెలిపారు. తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని షేక్ దాదాపీర్‌ను(28) ఆయన భార్య ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి స్థానిక పోలీస్ స్టేషనలో అరెస్టు వివరాలను విలేకరులకు శనివారం వివరించారు. పరిగి గ్రామానికి చెందిన దిల్షాద్ 11 ఏళ్ల కిందటే భర్తను వదిలేసి ఒంటరిగా ఉండేది. ఆమెకు హిందూపురం త్యాగరాజ్‌నగర్‌కు చెందిన షేక్ దాదాపీర్‌తో రెండో పెళ్లి జరిగింది. షేక్ దాదాపీర్(28) వెల్డింగ్ పనులు చేసుకుంటూ చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ స్నేహితులతో జులాయిగా తిరిగేవాడు. అప్పుడప్పుడు తన స్నేహితులను ఇంటికి తీసుకొచ్చేవాడు. ఈక్రమంలోనే తన భర్త స్నేహితుల్లో ఒకడైన పవనతో దిల్షాద్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న దాదాపీర్ తన భార్య, పవనకుమార్‌ను హెచ్చరించాడు.
దీంతో వారిద్దరూ దాదాపీర్ అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో పవన తన స్నేహితులు నరసింహులు, బుడేనసాబ్ ఇనాయతుల్లా, బాబాఅఫ్రీదిలతో కలిసి దాదాపీర్‌ను మద్యం తాగేందుకు ఆటోనగర్‌లోని ఓ పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లారు. అక్కడ మద్యం సేవించి పదునైనా ఆయుధంతో హత్యచేసి పరారయ్యారు. కొంతమంది అందించిన సమాచారంతో మృతుడు దాదాపీర్ తల్లి షేక్ రహ్మతున్నీసా ఘటనస్థలానికి వెళ్లి కుమారుడిని గుర్తుపట్టి లేపాక్షి పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేసింది. హిందూపురం రూరల్ సీఐ జనార్దన ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈక్రమంలో శనివారం మలిరెడ్డిపల్లి దర్గావద్ద ఉన్న దిల్షాద్ సహాఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు నేరం అంగీకరించడంతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.