be alret ఆదమరిస్తే .... అంతే..!
ABN , Publish Date - May 01 , 2025 | 11:43 PM
మండలంలోని నారేపల్లి సమీపంలోని బ్రిడ్జికి రక్షణ గోడ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
కొత్తచెరువు, మే 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని నారేపల్లి సమీపంలోని బ్రిడ్జికి రక్షణ గోడ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. బుచ్చయ్యగారిపల్లి క్రాస్ నుంచి నారేపల్లికి వచ్చే రహదారిలోని కాలువపై బ్రిడ్జికి ఇరువైపులా రక్షణ గోడ లేదు. పైగా ఈ కాలువ టర్నింగ్‌లో ఉండటంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో రాత్రి సమయాల్లో కొత్తగా ఎవరైనా వాహనదారులు వస్తే.. రోడ్డు సమాంతరంగా ఉందని కాలువల్లోకి దూసుకెళ్లిన సంఘటనలు అనేకం. ఇటీవల నారేపల్లి మీదుగా వెల్దుర్తికి వెళ్తున్న ఆటో అదుపు తప్పి కాలువలోకి పడటంతో పలువురు గాయపడ్డారు. ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్ అధికారులు స్పందించి.. రక్షణ గోడ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.