Share News

వర్షం వస్తే.. మొత్తం చిత్తడే ..!

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:08 AM

వర్షం వస్తే తమ కాలనీలు మొత్తం చిత్తడి.. చిత్తడిగా మారుతున్నాయని స్థానిక సుబ్బలక్ష్మి, రసూలమ్మ కాలనీ వాసులు వాపోతున్నారు.

వర్షం వస్తే.. మొత్తం చిత్తడే ..!
సుబ్బలక్ష్మి కాలనీ దుస్థితి

విడపనకల్లు, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): వర్షం వస్తే తమ కాలనీలు మొత్తం చిత్తడి.. చిత్తడిగా మారుతున్నాయని స్థానిక సుబ్బలక్ష్మి, రసూలమ్మ కాలనీ వాసులు వాపోతున్నారు. కనీసం నడటానికి కూడా వీలు లేకుండా ఉంటోందని, సీసీ రోడ్లు వేయించాలని పలుమార్లు అధికారులను కోరినా పట్టించుకోవడం లేదన్నారు. ఈ కాలనీలు ప్రభుత్వ రికార్డుల్లో లేవని, దీంతో సీసీ రోడ్లు వేయటం కుదరదని అధికారులు తెగేసి చెబుతున్నారన్నారు. రెండు నెలల్లో ఎన్నికలు వస్తాయని, అప్పుడు తమ కాలనీల్లోకి ఓటు అడిగేందుకు వచ్చిన నాయకులను, వారి వెంట ఉన్న అధికారులను నిలదీస్తామని సోషియల్‌ మీడియా ద్వారా హెచ్చరించారు.

Updated Date - Oct 25 , 2025 | 12:08 AM