కుష్ఠు బాధితులను గుర్తించండి
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:19 AM
సర్వే ద్వారా కుష్ఠు బాధితులను గుర్తించాలని స్టేట్ శాంపిల్ సర్వే అధికారి డాక్టర్ ఉషారాణి పేర్కొన్నారు
విడపనకల్లు, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): సర్వే ద్వారా కుష్ఠు బాధితులను గుర్తించాలని స్టేట్ శాంపిల్ సర్వే అధికారి డాక్టర్ ఉషారాణి పేర్కొన్నారు. సర్వేలో భాగంగా మండలంలోని పెద్ద కొట్టాలపల్లి, విడపనకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆమె బుధవారం తనిఖీ చేశారు. ఈమె మాట్లాడుతూ గ్రామాల్లో సర్వేలు నిర్వహిస్తున్న సమయంలో కుష్ఠు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కు ష్ఠు అతి సాధారణ వ్యాధి అని, ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం పాటు మల్టీ డ్రగ్ థెరపీ మందులు వాడితే నయం అవుతుందని తె లపాలని సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి స్ర్కీనింగ్ చేయాలన్నారు. రాగి రంగు మచ్చలు లేదా నరాలలో అనుమానపు లక్షణాలు ఉంటే వారిని గుర్తించి వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపాలన్నారు. అక్కడ పరీక్షలు అనంతరం కుష్ఠుగా నిర్ధారణ అయితే వెంటనే ఎండీటీ చికిత్సను అందివ్వాలన్నా రు. వారి కుంటుంబలోని కుటుంబ సభ్యులకు సింగిల్ డోస్ రిఫార్మ్సిన చికిత్సలు అందివ్వాలన్నారు. అనంతరం ఇంటింటి సర్వేను పరిశీలించారు. కార్యక్రమంలో విడపనకల్లు. పెద్ద కొట్టాలపల్లి వైద్యులు పు ష్పా, మస్రద్‌జాహ, జయకుమార్ నాయక్, మనోజ్, గంగాధర్ రెడ్డి, పీఎంఓ నాగన్న, తిరుపాల్ నాయక్, సూపర్ వైజర్లు పాల్గొన్నారు.