Share News

యాడికిని క్లీన అండ్‌ గ్రీనగా చేస్తా : ఎమ్మెల్యే

ABN , Publish Date - Dec 29 , 2025 | 11:15 PM

యాడికి గ్రామపంచాయతీని క్లీన అండ్‌ గ్రీనగా మారుస్తానని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి తెలిపారు.

యాడికిని క్లీన అండ్‌ గ్రీనగా చేస్తా : ఎమ్మెల్యే
పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే

యాడికి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): యాడికి గ్రామపంచాయతీని క్లీన అండ్‌ గ్రీనగా మారుస్తానని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి తెలిపారు. సోమవారం యాడికిలో ఎమ్మెల్యే సొంత నిధులతో పెద్దఎత్తున పరిశుభ్రత ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 10 ఎక్స్‌కవేటర్లు, రెండు హిటాచీలు, 15 ట్రాక్టర్లు, 70 మంది పారిశుధ్య సిబ్బందితో పెద్దఎత్తున ఈ కార్యక్రమం చేపట్టారు. మురుగునీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టారు. అనంతరం స్థానిక ఆంజనేయస్వామికాలనీ తదితరచోట్ల సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రూ.20లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్‌ పంపింగ్‌ మోటార్లను ప్రారంభించారు. ఇందులో పలువురు అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2025 | 11:15 PM