ఉచిత ప్రయాణం ఎలా ఉంది..?
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:26 AM
ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఎలా ఉంది.. ఇబ్బందులు ఏమీ లేవు కాదా.. అని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు బస్సులో ప్రయాణిస్తున్న మహిళల వద్ద ఆరా తీశారు.
బ్రహ్మసముద్రం, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఎలా ఉంది.. ఇబ్బందులు ఏమీ లేవు కాదా.. అని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు బస్సులో ప్రయాణిస్తున్న మహిళల వద్ద ఆరా తీశారు. బుధవారం మండలంలోని గొంచిరెడ్డిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఎక్కి మహిళలతో ముచ్చటించారు. స్త్రీశక్తి పథకం ఎలా ఉందని, ఉచిత బస్సు ప్రయాణం సంతృప్తికరంగా ఉందా అని అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తోందని.. ఉచిత బస్సు ప్రయాణం బాగా ఉందని మహిళలందరూ సంతోషం వ్యక్తం చేశారు.